Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..
- మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు..
- పవన్ కు ఫిర్యాదు చేసిన ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి..
- కాకాణి గోవర్థన్ రెడ్డి.. వైసీపీ నేతలు తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. కాకాణి గోవర్థన్ రెడ్డి, వైసీపీ నాయకులు తనపై చేసిన బెదిరింపులు, దౌర్జన్యాలను పవన్ కు ఫిర్యాదు చేశారు లక్ష్మి.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఫిర్యాదు చేసిన ఆమె.. ఎన్నికైనప్పటి నుంచి బెదిరింపులకు దిగి బలవంతంగా సంతకాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, లక్ష్మి ఫిర్యాదుపై పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!