డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు..
చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు! పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న…
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దాంతో వైసీపీకి చెందిన మేయర్ సురేశ్ బాబు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. ‘హూ ఈజ్ జైశ్రీ’ అంటూ మేయర్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు. రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని.. నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? అని ఎమ్మెల్యే మాధవీ…
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో కుర్చీ వివాదంపై కడప నగరం మొత్తంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా, జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్‌లకు అనుమతి తీసుకొని నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పోరేషన్ కార్యాలయం…
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.