కడప ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవి జాబ్ మేళాను ప్రారంభించారు. రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 52 ప్రైవేట్ కంపెనీలలో 5700 ఉద్యోగాల కోసం సుమారు పది వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ……
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో దేవి రెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు, గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది..
Minister Savitha: కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడికెళ్లినా సమస్యలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగింది.. గతంలో పులివెందులకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నీటి ప్రాజెక్టుల పనులు ఇప్పుడు చేపడుతున్నాం.
కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు వేశారు. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి.. అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు కడప డీటీసీపై ఆరోపణలు ఉన్నాయి. కడప డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం మహిళా…
బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అని, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని, పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం…
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రాజకీయాలను ఎన్టీఆర్ సమూలంగా మార్చారన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. గొప్ప కథానాయకుడిగా, గొప్ప నాయకుడుగా ఎదిగారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి…
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. శనివారం గుంటూరు, కడప జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.