బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న ఆయన.. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు..
బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఉమ్మడి కడప జిల్లాలోని మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది.. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు.. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు పవన్ కల్యాణ్..
40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు తన 56వ షోరూంను కడపలో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది.
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. నిద్రిస్తున్న వీఆర్‌ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో వీఆర్‌ఏ ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, వీఆర్‌ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయినట్టుగా చెబుతున్నారు.. ఈ దారుణానికి పాతపక్ష్యలే కారణంగా అనుమానిస్తున్నారు..
కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు.
కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు….. బంపరాఫర్లు తగులుతున్నాయా? మీ పంట పండింది పోండి… ఇక పండగ చేస్కోండి… మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అసలు కడప జిల్లా పరిషత్లో ఏం జరుగుతోంది? జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి? ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టిడిపి ఇటు వైసీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జడ్పీలో టిడిపికి బలం లేకున్నా…వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకుంటున్నట్టు…
కడపలో చెత్త వివాదం కాస్తా.. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల నమోదు వరకు వెళ్లింది.. చెత్త వివాదం ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు.