LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..
- కేంద్రం కీలక ప్రకటన..
- ఎల్పీజీ స్థిరంగానే ఉంది..
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ సరఫరా అత్యంత స్థిరంగా కొనసాగుతోందని.. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పెరిగిన ఉత్పత్తి..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశీయ రిఫైనరీల నుంచి గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా 38 శాతం మేర పెరిగింది. ఇది డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను నిరంతరం కొనసాగించడానికి దోహదపడుతోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 94 శాతం గ్యాస్ బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా.. వినియోగదారులకు సౌకర్యవంతంగా మారింది.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
దుర్వినియోగానికి అడ్డుకట్ట..
సిలిండర్ల పక్కదారి మళ్లింపును (Black marketing) అరికట్టేందుకు ప్రభుత్వం ‘డెలివరీ ఆథెంటికేషన్ కోడ్’ (DAC) విధానాన్ని కఠినతరం చేసింది. ఈ విధానం వినియోగం ప్రస్తుతం 76 శాతానికి పెరిగింది. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) తప్పనిసరి చేయడం ద్వారా అసలైన లబ్ధిదారులకే గ్యాస్ అందుతోంది.
Also Read:North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?
అక్రమాలను అరికట్టే క్రమంలో అధికారులు దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12,000కు పైగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 15,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
వినియోగదారులకు సూచనలు..
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. గ్యాస్ సిలిండర్ల నిల్వ తగినంతగా ఉందని.. బుకింగ్ చేసుకున్న తక్కువ సమయంలోనే డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!