పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు.
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన.
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు.
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ రికార్డ్ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో కొందరు న్యాయవాదులు జిల్లా జడ్జిని ఆశ్రయించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు కోర్టు ఆవరణలోనే పోలీసులను పిలిచారు.
Fake Court: ఇప్పటి వరకు మనం చాలానే ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాము. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు బట్టబయలైంది. ఈ కేసులో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నకిలీ కోర్టు పట్టుబడింది. వృత్తిరీత్యా నకిలీ జడ్జిగా, లాయర్‌గా నటిస్తూ గత కొన్నేళ్లుగా ఈ మోసం వ్యాపారం సాగుతోంది. అసలు విషయం తెలియగానే ప్రజలు షాక్ అవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు…
పలువురు న్యాయవాదులు తాజాగా మన దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వత్తిళ్లు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ లాయర్లు ఈ మేరకు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ లతో సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడకు…