దేశవ్యాప్తంగా దుమ్ములేపిన నాటు నాటు ఆస్కార్ సాధించింది. దీంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది.
తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన "నాటు నాటు..." అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు.
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది.
Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.