NTR30: వేట మొదలుపెట్టిన తారక్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Started Shooting For NTR30: జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మార్చి 23వ తేదీన NTR30 లాంచ్ అవ్వగా.. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు.. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఒక భారీ సెట్‌లో అడుగిడిన ఎన్టీఆర్ వీడియోని కూడా ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే ఈ వీడియోకి జత చేసి రిలీజ్ చేశారు. ఇందులో తారక్ ఫేస్‌ని చూపించలేదు. వెనుక నుంచే అతడు లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని చూపించారు. కొరటాల శివని తారక్ కలవడంతో.. ‘వస్తున్నా’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వీడియో ముగుస్తుంది.
Guna Shekar: వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Also Read
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
ఈ సినిమా అప్డేట్స్ కోసం ఏడాదికి పైగా అభిమానుల్ని వెయిట్ చేయించిన చిత్రబృందం.. ఇప్పుడు మాత్రం వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ని సంతోషపెడుతోంది. ముఖ్యంగా.. లాంచ్ అయినప్పటి నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్‌ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దింపుతున్నామని, షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. క్రేజీ విషయాల్ని బయటపెడుతోంది. ఇప్పుడు తారక్ షూట్‌లో పాల్గొన్న వీడియో షేర్ చేసి.. ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చింది యూనిట్. ఈ సినిమా మేకర్స్ పెంచిన వేగాన్ని చూస్తుంటే.. ఇకపై ప్రతీ ప్రత్యేక మూమెంట్‌లో ఫ్యాన్స్‌కి పండగలాంటి అప్డేట్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని.. మే 20వ తేదీన టీజర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం.. ఆలోపు NTR30 మేకర్స్ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో?
Gunasekhar: ఆ ఒక్క మాట చెప్పగానే.. మోహన్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
ఇకపోతే.. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. ఆర్ఆర్ఆర్‌తో తారక్ గ్లోబల్ స్టార్‌గా అవతరించడంతో.. ఈ ఎన్టీఆర్30పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందించాలన్న ఉద్దేశంతోనే.. కొరటాల చాలా సమయం తీసుకొని స్టోరీని సిద్ధం చేశాడు. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా కోసం పేరుగాంచిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు.
The FEAR is here ❤️🔥@tarak9999 from the sets of #NTR30 🔥🔥#NTR30ShootBegins ❤️🔥#KoratalaSiva #JanhviKapoor @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/BgkqgQI3Qs
— NTR Arts (@NTRArtsOfficial) April 1, 2023
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!