టీడీపీ అధినేత, మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీఆర్ తులసీ వనం..చంద్రబాబు గంజాయి మొక్కగా ఎన్టీఆర్ కుటుంబంలో చేరాడు.గుడివాడ లో ఎక్కడైనా చంద్రబాబు తో చర్చకు సిద్ధం..గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశాడో, వైఎస్సార్, జగన్ హయాంలో నేనేం చేశానో చర్చకు సిద్ధం అన్నారు నాని. అధికారంలో ఉండగా గుడివాడను గాలికి వదిలేశాడు..నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టింది నేను, జూనియర్ ఎన్టీఆర్ .అత్తారింటికి ఎవరైనా భార్యతో వెళతారు. చంద్రబాబు ఎవరితో వెళ్ళాడు??
హరికృష్ణ ఇంటి తాళాలు కూడా తీయలేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా నిమ్మకూరులో బస్సులో పడుకున్నాడు.. నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశాడు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరు మీద ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తులు కేవలం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు మాత్రమే. 42 ఏళ్ల తర్వాత, అత్తారింటికి నిమ్మకూరు వచ్చి చంద్రబాబు బస్సులో నిద్రించాల్సి వచ్చింది. చంద్రబాబు నిద్రించడానికి నిమ్మకూరులో ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు .క్యాసినో పెట్టి అవినీతి చేసి ఉంటే సీబీఐ, ఈడీ లాంటివి నన్ను వదిలేస్తాయా??ఆధారాలు లేని ఆరోపణలు ఎందుకు అన్నారు కొడాలి నాని.
Read Also: Hema Malini : ‘ఐ యామ్ సారీ’ అంటున్న బాలీవుడ్ డ్రీమ్ గర్ల్
వ్యభిచార గృహాలు నడిపించిన వెధవ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.16 కోట్లతో సైడ్ కాల్వలతో కలిపి రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్ల స్థలాల కోసం సీఎం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారని గుర్తుచేశారు. గుడివాడకు మంచినీటి సదుపాయం కల్పించింది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. గుడివాడలోని మూడు మండలాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి రూ.130 కోట్లతో టెండర్లు సిద్ధం చేశామని, రూ.23 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నాం, రూ.15 కోట్లతో ఆసుపత్రి ప్రారంభించనున్నాం, మే నెలలో సీఎం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తారని కొడాలి నాని చెప్పారు.
తన భార్య ఆస్తులను చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు. అఫిడవిట్ ప్రకారం.. భార్య ఆస్తులతో కలిపి చంద్రబాబు ఆస్తి విలువ రూ.668 కోట్లు. రెండెకరాల నుంచి చంద్రబాబు ఆస్తి రూ.668 కోట్లకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలన్నారు.చంద్రబాబు గుడివాడలో ఎవరికి ప్రచారం చేసినా ఓడిపోవడమే జరుగుతుంది. దేవుడి దయవల్ల చంద్రబాబు నాకు ప్రచారం చేయలేదు కాబట్టే నేను గెలిచాను. రానున్న ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ ఓడిపోవడం ఖాయం . చంద్రబాబు జిత్తుల మారి నక్క అని తీవ్రంగా విమర్శించారు కొడాలి నాని.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్