మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని పై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలినాని కళ్లు బైర్లు కమ్మాయన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. కొడాలి నానికి తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధమై.. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు.గుడివాడకు ఎన్నో మంచి పనులు చేసిన చంద్రబాబు చేసిన ఒక్కే ఒక్క చెడ్డ పని కొడాలినాని కి టిక్కెట్ ఇవ్వటమే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని. బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీకుండా కొడాలి నాని మాట్లాడుతున్నాడు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళల్ని తూలనాడే కొడాలి నాని లాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదు. చంద్రబాబు కాళ్లపై పడి బీఫామ్ తీసుకున్న విషయం కొడాలినాని మరిచాడా..? గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. అసత్యాలతో గుడివాడ ప్రజల్ని 20ఏళ్లుగా కొడాలి నాని మోసగిస్తూ వస్తున్నాడు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుడివాడలో నిర్మించిన 800కు పైగా టిడ్కోఇళ్లు పేదలకు ఇంతవరకు ఎందుకివ్వలేదు..?
గుడివాడ రోడ్ షో కమ్మ వారి షో అంటూ కొడాలి నీచ రాజకీయం చేస్తున్నారు. రోడ్డు షోలో అని వర్గాల నాయకులు పాల్గొన్న విషయం దుర్మార్గుడైన కొడాలి నానికి కనపడదా..? కొడాలి నానికి బి-ఫామ్ ఇచ్చింది చంద్రబాబు కాదా..? సీట్ కోసం చంద్రబాబు కాళ్ళ మీద పడిన సంగతి గుర్తు లేదా..?కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే రకం కొడాలినాని. నిమ్మకూరులో NTR బసవతారకం దంపతుల విగ్రహాలు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్. బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీకుండా కొడాలి నాని మాట్లాడుతున్నాడన్నారు.
Read Also: DGP Anjani Kumar : శాంతి, భద్రతల పరిరక్షణకు మరింత అప్రమత్తంగా ఉండాలి