Jogi Ramesh: మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు.. అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని వెళ్లాను.. నిరసన తెలుపుతున్న నాపై దాడి చేసారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. లెట్స్ వాచ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు.
చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్ళాడో.. ఎక్కడికి వెళ్ళాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి..? అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లాడుకనుకే ఇంత రహస్యమన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు…
మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.. కూటమి గెలుస్తుందంటూ మావాళ్లను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆయన.. జూన్ 4వ తేదీన వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.