ACB Raids: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను కబ్జా చేశారనే అనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు కాగా.. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Vizag MLC Elections: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు