Minister Nara Lokesh: రెడ్ బుక్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. అది మ్యాండేటరీ..!
- రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్..
- రెడ్‌బుక్ మాకు మ్యాండేటరీ అంటున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్.. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది నేను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చారు అన్నారు.. అయితే, రెడ్‌బుక్‌పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. రెడ్‌బుక్ మాకు మ్యాండేటరీ అన్నారు..
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్..
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. జోగి రమేష్ కుమారుడు ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన.. అగ్రిగోల్డ్ భూముల పత్రాలకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి.. ఆ భూములను అమ్మేశారు.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.. భవిష్యత్‌లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు..
Read Also: Team India Schedule: టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?
మరోవైపు.. జగన్ సైకోనే కాదు.. ఫేక్ కూడా అంటూ ఎద్దేవా చేశారు.. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమైంది? అని ప్రశ్నించిన మంత్రి లోకేష్.. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది.. బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారు.. కానీ, ఒక ఇటుక విరగలేదు.. ఇంకేం కాలేదు.. దానికి గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టింది ఎవరు జగన్ మోహన్ రెడ్డి కదా? అని ప్రశ్నించారు.. పేరు పెట్టుకుంది ఎవరు? జగన్ కాదా? అని నిలదీశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు