పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అని ఆయన కొనియాడారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు... పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ అని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.…