కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు.
కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్గా మారిపోయింది..
విజయవాడలోని భవానీపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏలూరులో జనవరి 30న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వైసీపీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు పలికామని తెలిపారు. గడచిన…
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే కొంటామని అన్నారు. వెంటనే ఆర్డీవోను పిలిచి కొనుగోలు చేయిస్తాను.. సారథి నిన్నటి వరకు మాతోనే ఉన్నాడు.. ఇప్పటికి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.
జోగి రమేష్.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.. జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ్యింది.. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు. తాడేపల్లిలో మంత్రి…
గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. నేను కూడా పెడనలోనే ఉండాలని అనుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి జగన్ నేను పెడన నుంచి పోటీ చేయాలా వేరే చోటు నుంచి చేయాలా నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ అన్నారు. ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం…
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.