Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత మహిళా క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు గవాస్కర్ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకుంటూ జెమిమాకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా.. ఆమెతో కలిసి పాట పాడాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Marurthi: బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు గతంలో ఇచ్చిన…
Jemimah Rodrigues: భారత మహిళల క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మరోసారి తన మ్యూజిక్ ట్యాలెంట్ ను చాటుకుంది. బ్యాట్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించే జెమిమా, ఈసారి క్రికెట్ గ్రౌండ్ బయట సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముంబైలో జరిగిన ‘United in Triumph’ ఈవెంట్‌లో ఆమె ఇచ్చిన మ్యూజికల్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Dhurandhar: ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన…
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్‌బై చెప్పనున్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది జాతీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహిళా మణులు చరిత్ర సృష్టించారు. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో మూడు సార్లు ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను డిసెంబర్ 23న ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మెగ్ లానింగ్ నాయకత్వంలో అస్బుతంగా ఆడిన ఢిల్లీ.. ఈ ఏడాది ప్లేయర్ రిటెన్షన్లలో ఆమెను కొనసాగించకపోవడంతో ఆ అధ్యాయం ముగిసింది. వేలంలో మళ్లీ లానింగ్‌ను దక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లకు ఆమెను కొనుగోలు చేయడంతో ఢిల్లీకి నిరాశ ఎదురైంది. Lion Viral…
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ల వివాహం అనూహ్యంగా వాయిదా పడి చివరకు రద్దైన విషయం తెలిసిందే. తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్మృతి మంధాన ప్రకటించింది. వీరి షాకింగ్ డెసిషన్ తో అటు అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పలాష్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మంధాన ప్రకటించింది. ఇది మంధానకు సులభమైన సమయం కాదు. ఈ క్లిష్ట సమయాల్లో జెమిమా రోడ్రిగ్స్…
World Cup Team of the Tournament: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం తర్వాత ఐసీసీ (ICC) ప్రకటించిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం చెలాయించారు. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత త్రయం స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు స్థానం సంపాదించారు. ఈ ముగ్గురూ జట్టు తొలి ప్రపంచకప్ విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్…
Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో…
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా…
మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89), దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్) చెలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఆదివారం…
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. సెమీస్‌లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్‌ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ…