Jemimah Rodrigues: భారత మహిళల క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మరోసారి తన మ్యూజిక్ ట్యాలెంట్ ను చాటుకుంది. బ్యాట్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించే జెమిమా, ఈసారి క్రికెట్ గ్రౌండ్ బయట సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముంబైలో జరిగిన ‘United in Triumph’ ఈవెంట్‌లో ఆమె ఇచ్చిన మ్యూజికల్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dhurandhar: ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన “ధురంధర్”..
ఈ కార్యక్రమంలో జెమిమా బాలీవుడ్ చిత్రం ‘ఇక్బాల్’ నుంచి “ఆశయేన్” (Aashayein) సహా పలు పాటలను గిటార్‌తో పాటు తన మధుర స్వరంతో పాడుతూ స్టేజ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రేక్షకులు మాత్రమే కాదు, వేదికపై ఉన్న ప్రముఖులు కూడా ఆమె ప్రతిభకు ఫిదా అయ్యారు. ఈ సంగీత ప్రదర్శన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంబానీ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరగడం విశేషం. జెమిమా ప్రదర్శనకు హాజరైన అతిథులు చప్పట్లతో ఆమెను అభినందించారు. భారత మహిళల జట్టుకు కీలక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె సంగీతంలోనూ తనదైన ముద్ర వేసింది.
F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..
ఈ ఈవెంట్ క్రీడలు, సంస్కృతి, సామాజిక వేడుకల సమ్మేళనంగా నిలిచింది. అయితే అందులో జెమిమా రోడ్రిగ్స్ ప్రదర్శన మర్చిపోలేని క్షణంగా మారింది. క్రికెట్‌తో పాటు కళాత్మక ప్రతిభను కూడా సమర్థంగా కలిపి చూపించినందుకు అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి జెమిమా రోడ్రిగ్స్ క్రికెట్‌లోనే కాదు, సంగీతంలోనూ తన సత్తా చూపిస్తూ, “బ్యాట్‌తోనే కాదు… గిటార్‌తో కూడా అదుర్స్” అనిపించేలా మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది.
Indian Women's Team batting sensation Jemimah Rodrigues showed off her artistic side with a musical medley at the #UnitedinTriumph event. pic.twitter.com/U1e3Lq4wFi
— Mumbai Indians (@mipaltan) January 7, 2026