2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!
- మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్‌బై
- ఈ ఏడాది చరిత్ర సృష్టించిన నారీ శక్తులు
- ప్రపంచ కప్‌ను ముద్దాడిన భారత మహిళా క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్‌బై చెప్పనున్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది జాతీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహిళా మణులు చరిత్ర సృష్టించారు. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్నల్ సోఫియా ఖురేషి
కల్నల్ సోఫియా ఖురేషి పేరు ఈ ఏడాది మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు కల్నల్ సోఫియా ఖురేష్ నాయకత్వం వహించారు. అలా సోఫియా ఖురేషి వెలుగులోకి వచ్చారు. దేశమంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..

హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్ ప్రీత్ కౌర్.. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ ఏడాది ఆమె ఆధ్వర్యంలో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే మహిళల ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టును ముందుండి నడిపించి కప్ సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జెమిమా రోడ్రిగ్స్
ఇక హర్మన్ ప్రీత్ కౌర్‌లాగానే.. ఈ ఏడాది మహిళల క్రికెట్ జట్టులో జెమిమా రోడ్రిగ్స్ పేరు కూడా జాతీయంగా.. అంతర్జాతీయంగా బాగా మార్మోగింది. వన్డ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వీర బాదుడు బాదింది. నాటౌట్‌గా నిలిచి ఫైనల్‌కు చేర్చింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానల్స్‌లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

రేఖా గుప్తా
రేఖా గుప్తా.. ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈ ఏడాది దేశ రాజధానిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవి వరించింది. బీజేపీ అధిష్టానం సీనియర్లను పక్కనపట్టి రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. ఇలా రేఖా గుప్తా పేరు కూడా చరిత్ర సృష్టించారు.

మైథిలి ఠాకూర్
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకుంది. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందింది. నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసి మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించారు. ఇలా అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించింది.

తాజావార్తలు
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!