అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నారులతో కలిసి సందడి చేశారు. వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పిల్లలతో కలిసి ట్రంప్ ఆడుకున్నారు.
అమెరికాలో బుధవారం దారుణం జరిగింది. మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారి జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తుండగా జరిపిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దేశాల మధ్య యుద్ధాలు.. ఇంకోవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించడం. ఇలా ఏడాది పొడవునా గందరగోళమే నెలకొంది. ఈ సంవత్సరం హైలెట్‌గా నిలిచిన వార్తలపై ఒకసారి లుక్కేద్దాం. ట్రంప్ వాణిజ్యం యుద్ధం ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ…
రాప్ స్టార్ నిక్కీ మినాజ్ నోరుపారేసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ‘హంతకుడు’ అంటూ సంబోంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్ దంపతుల మధ్య ఏదో జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. సంసారంలో గొడవలు మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ గొడవపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు.
JD Vance Erika Kirk: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వారం ప్రారంభంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ క్యాంపస్ ఈవెంట్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీని స్వీకరిస్తుందని చెప్పారు.
JD Vance - Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని…
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.