JD Vance: నా భార్య హిందూ… ఏదో ఒక రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని వాన్స్ క్రమంగా తన భార్య సహాయంతో క్రైత్సవాన్ని స్వీకరించినట్లు తెలిపారు. వాన్స్ తన మతపరమైన ప్రయాణం, అది తన కుటుంబ జీవితంపై చూపిన ప్రభావం గురించి ప్రసంగించారు.
READ MORE: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
తన భార్య ఉష గురించి వాన్స్ మాట్లాడుతూ.. ఆమె చాలా ఆదివారాలు తనతో చర్చికి వస్తుందని తెలిపారు. “నేను క్రైస్తవ మతాన్ని నమ్ముతాను. నా భార్య అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె అర్థం చేసుకోపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తికి వారి స్వంత మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. తన ఇద్దరు పిల్లలు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారు. నా పెద్ద కుమారుడు గత సంవత్సరం తన మొదటి కమ్యూనియన్‌ను అందుకున్నాడు.” అని వాన్స్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాన్స్ ప్రొటెస్టంట్ క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. కానీ చాలా కాలం పాటు తన దేవుడిని నమ్మలేదు. 2016లో ఆయన కాథలిక్కు మతంలోకి మారాలని భావించారు. 2019లో బాప్టిజం స్వీకరించారు. 2024లో తన భార్య ఉష ఈ ప్రయాణంలో తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని వాన్స్ చెప్పారు.
READ MORE: PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోడీ నివాళి
అయితే.. ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. యేల్ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి.. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!