JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, అక్టోబర్ 29న టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన భార్య హిందూ మతం నుంచి క్రైస్తవ మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశాడు. తన పిల్లల్ని క్రైస్తవులుగా పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై భారతీయ అమెరికన్లు మండిపడుతున్నారు. ఇది ఆయన కపటత్వం, ‘‘హిందూ-ఫోబియా’’ ను వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అధికార రిపబ్లికన్ పార్టీ, క్రైస్తవ సంప్రాదాయ వాదులు ప్రశంసిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు జేడీ వాన్స్ వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. దీపావళి రోజు వాన్స్ ఎలాంటి సందేశాన్ని కూడా పోస్ట్ చేయాలని గుర్తు చేశారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వర్ సిబల్ మాట్లాడుతూ.. వాన్స్ తన భార్య హిందూ మూలాన్ని ఒప్పుకోవడానికి భయపడుతున్నాడని విమర్శించారు. టెక్ ఎగ్జిక్యూటివ్, జియోపొలిటికల్ నిపుణుడు డీప్ బారోట్ కూడా వాన్స్‌ను ‘‘కపట వ్యక్తి’’ అని ఆరోపించారు.
Read Also: India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం
చార్లీ కిర్క్ భార్యతో లవ్..?
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు తమకు నచ్చినట్లుగా ఊహాగానాలు లేవనెత్తారు. మరికొంత మంది వాన్స్-ఉషాలు విడాకులు తీసుకోబోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు వీరు లేవనెత్తిన రూమర్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల, ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ ఊటాలో హత్యకు గురయ్యాడు. ఆయన భార్య ఎరికా కిర్క్‌తో జేడీ వాన్స్ లవ్‌లో ఉన్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఆధారంగా వాన్స్, ఎరికాతో దిగిన ఫోటోను వైరల్ చేస్తున్నారు.
ఒక వేళ జేడీ వాన్స్ అమెరికా అధ్యక్ష పోటీలో ఉంటే, అమెరికా ఒక హిందూ మహిళను ‘‘ఫస్ట్ లేడీ’’గా అంగీకరించడని తెలుసని, అతనను 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎరికాను వివాహం చేసుకోవచ్చని MAGA( మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మద్దతుదారులు పరోక్షంగా సూచిస్తున్నారు. ఆయన పదవిలో ఉండగా విడాకులు తీసుకున్న మొదటి ఉపాధ్యక్షుడు కానున్నారు అని ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అరి డ్రెన్నెన్ ట్వీట్ చేశారు.
అయితే, ఉషా మాత్రం తాను ఎప్పటికీ హిందువుగానే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మతమార్పిడి ఉద్దేశ్యం లేదని నొక్కి చెప్పారు. వారి పిల్లలు క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో పెరుగుతున్నట్లు చెప్పారు. నా పిల్లలకు నేను క్రిస్టియన్ కాదని తెలుసని, వారికి హిందూ సంప్రదాయం గురించి పుష్కలంగా తెలుసు అని ఉషా అన్నారు.