Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?. ఐపీఎల్…
టీమిండియా స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో బుమ్రా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. 237…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఐపీఎల్ 18వ సీజన్లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో ముంబై నాలుగు మ్యాచులు ఆడి.. కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే.. ఇక నుంచి అయినా విజయాలు సాధించాలి. మరోవైపు బెంగళూరు మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి టాప్-3లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ‘ఈసాలా…
టీమిండియా పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్నెస్ టెస్టులో పాసై.. ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలను ముంబై ప్రాంచైజీ షేర్ చేసింది. ఈ…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఆడనున్నాడు. గత జనవరిలో గాయపడిన బుమ్రా.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనే ఆడతాడని ఇప్పటికే ముంబై కోచ్ వెల్లడించాడు. బుమ్రా ఐపీఎల్ ఎంట్రీ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసిన…
ఐపీఎల్ 2025లో విజయాలు లేక సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ప్రాంచైజీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ‘రెడీ టు రోర్’ అని క్యాప్షన్ ఇచ్చి.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో బుమ్రా సతీమణి సంజనా గణేశన్, కుమారుడు అంగద్‌ను చూపించారు. అంగద్‌కు తండ్రి బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి సంజనా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…