టీమిండియా స్టార్ పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. బ్యాటర్లకు తన పేస్ పదునుతో చుక్కలు చూపిస్తాడు. పిచ్ ఏదైనా, మ్యాచ్ ఎక్కడైనా చెలరేగిపోతుంటాడు. ఎంతటి డేంజరస్ బ్యాటర్ అయినా.. బూమ్ బూమ్ ముందు తలొంచాల్సిందే. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్‌ను సైతం అద్భుత బంతితో బోల్తా కొట్టిస్తుంటాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో సెంచరీ హీరో జో రూట్ (104)ను బుమ్రా అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టెస్టుల్లో జో రూట్‌ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడం ఇది పదకొండవ సారి. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రూట్‌ను పదిహేను సార్లు పెవిలియన్ చేర్చాడు. టెస్టుల్లో 11, వన్డేల్లో 3, టీ20లలో ఒకసారి ఔట్ చేశాడు. దాంతో యాక్టివ్ ‘ఫ్యాబ్’ ఫోర్‌లో ఒకడైన రూట్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఏ బౌలర్‌కూ ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్.. రూట్‌ను 14 సార్లు (టెస్టుల్లో 11, వన్డేల్లో 3) పెవిలియన్ చేర్చాడు. జోష్ హాజిల్‌వుడ్ (13), రవీంద్ర జడేజా (13), ట్రెంట్ బోల్ట్ (12) రూట్‌ను ఔట్ చేశారు. యాక్టివ్ ఫ్యాబ్ ఫోర్‌లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఉంటారన్న విషయం తెలిసిందే.
Also Read: England vs India: ఇంగ్లండ్ ఆలౌట్.. అప్పుడే మొదటి వికెట్ కోల్పోయిన భారత్!
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్స్ పడగొట్టాడు. హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో లార్డ్స్ మైదానంలో మొదటిసారి ఫైవ్ వికెట్ హాల్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఫామ్ మీదున్న జో రూట్‌ను ఔట్ చేయడంపై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బుమ్రానే రూట్‌కు సరైన మొగుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.