తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం…
ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.. గుజరాత్‌పై గెలుపుతో క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్తే.. ఈ మ్యాచ్‌లో ఓటమి మూఠగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇంటిదారి పట్టింది..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ…
రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని…
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు…