రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.
జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన భార్య వలన క్రిస్ట్మస్ చేసుకుంటానన్నారు.
పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తన అఫిడవట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లో భాగంగా పవన్ ఇష్ట పూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ప్రమాణం చేశారు.
పీఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంపాదనతో పాటు అప్పుల వివరాలను వెల్లడించారు. తన అయిదేళ్లలో రూ.114.76 కోట్లు సంపాదించినట్లు వెల్లడించిన ఆయన అప్పులను సైతం వివరాలు సైతం తన అఫిడవిట్ ద్వారా తెలిపారు.
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులు వారి ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడిస్తున్నారు. ఈ రోజు పీఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.