రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.…
కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ మాజీ మేయర్ సరోజతోపాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సరోజ మాట్లాడుతూ. జనసేన పార్టీలో మహిళలకు బీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక రాజీనామా చేసి వైసీపీలో చేరామని చెప్పారు. జగన్ నాశనం కావాలని కోరుకుంటున్న పవన్, చంద్రబాబు నాశనం…
ఏపీలో రాజీనామాలు, జంపింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.
జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందించారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాలకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి బీ-ఫారం నాదెండ్ల మనోహర్కు ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు అందించారు జనసేనాని పవన్కళ్యాణ్.