ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ సైతం ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు, కీలక నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.
READ MORE: RRR Re-Release : మరోసారి థియేటర్స్ కు వస్తున్న గ్లోబల్ బ్లాక్ బస్టర్.. రీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలోని రాజా నగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకులం లోక్ సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో నిర్వహిస్తున్న సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 03 గంటలకు విశాఖపట్నం లోక్ సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్ లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.