రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ నియోజకవర్గంపై అందరి ఫోకస్ నెలకొంది.అదే పిఠాపురం నియోజకవర్గం.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు .గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా సపోర్ట్ చేయలేదు .ఈ సారి టాలీవుడ్ లో చాల మంది సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు .ఈసారి జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది.ఈ సారి టీడీపీ ,బీజేపీ లతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది .
ఈసారి పవన్ కల్యాణ్ ను పిఠాపురం నియోజక వర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు సపోర్ట్ గా నిలిచింది..మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఇప్పటికే పిఠాపురం లో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు .తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను గెలిపించాల్సిందిగా ఓ వీడియో ను రిలీజ్ చేసారు .ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు .నేను ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సుకోసం మీ విజన్ ను,అలాగే మీ ప్రయత్నాలను చూస్తున్నాను .లక్షలాది ఆశలతో ఒకరిగా మీరు అడుగు పెట్టి ప్రజల అదృష్టాన్ని మంచిగా మార్చాలని కోరుకుంటుంన్నాను ..ఇప్పుడు జనంకు మీరు కావలి అని ట్వీట్ చేసాడు .ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది .
Since day 1, I’ve been watching your vision and efforts for the well being of Andhra Pradesh!!
As one among millions of hopes….I'm cheering for you to step in and change people's fortunes for the better sir….🤗🤗
Ippudu janam ki nuvvu kaavali 🙂 @PawanKalyan @JanaSenaParty
— Raj Tarun (@itsRajTarun) May 7, 2024