ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.35 నిముషాలకు తిరుపతి నుంచి హెలికాఫ్టర్‌లో రాజంపేటలోని కలికిరికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.45 నిమిషాలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
ఇక సాయంత్రం 5:20కి సభా ప్రాంగణం నుంచి మోడీ హెలికాఫ్టర్‌లో బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి ప్రధాని మోడీ వెళ్తారు.
ఇది కూడా చదవండి: Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారమే మోడీ ఏపీలో పర్యటించారు. తిరిగి మరోసారి బుధవారం రాష్ట్రానికి వస్తు్న్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కాలికి గాయం?