AP Deputy CM Pawan: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు ఆర్పిస్తున్నాను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది.
ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణంపై సందేహాలు కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు.
పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము - కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు.