MLC Vamshikrishna: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. వైసీపీలో పోటీ చేసే అవకాశాలు రావని తెలియడంతో వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. పవన్ సమక్షంలోనే జనసేనలో చేరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని వంశీకృష్ణ యాదవ్ తెలిపారు.
Read Also: YCP Leaders Join TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
ఇటీవల జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని, తన రాజకీయ భవిష్యత్ నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని వంశీకృష్ణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. యువరాజ్యం తరఫున అప్పటి ప్రభుత్వం పవన్‌తో కలిసి పోరాటం చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో వైసీపీలో చేరారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా పని చేస్తున్న ఆయన.. జనసేనలో చేరడంతో తిరిగి పవన్‌తో కలిసి పని చేయనున్నారు. వంశీకృష్ణ జనసేనలో చేరడంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి వంశీకృష్ణ కృషి చేస్తారని పవన్ భావిస్తున్నారు.
విశాఖపట్నం అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీ వంశీకృష్ణ యాదవ్ pic.twitter.com/eJpwr3KKd9
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2024