Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. వారు ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. బాలశౌరి జనసేనలో చేరడం ఖాయం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇదిలా ఉండగా.. ఆయన బందరు నుంచి బరిలోకి దిగుతారా లేదు సొంతూరు గుంటూరుపై గురిపెట్టారా అనేది.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Skill Development Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా..
కాగా, సీఎం జగన్‌కు సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపారు.. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఆయన పార్టీ వీడారట.. మరోవైపు.. ఆయన వైసీపీకి రాజీనామా చేయకముందే.. పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో సీఎం వైఎస్ జగన్ ఫొటోలకు తొలగించడం కూడా చర్చగా మారింది.. మొత్తంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఖాయమైంది.