మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.
ఏపీలో లోకల్స్, నాన్ లోకల్స్ మధ్య పోరాటం జరుగుతోందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వాళ్లకు సమర్ధించే వాళ్ళంతా నాన్‌లోకల్సేనని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటి (ఆదివారం) నుంచి కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణా దేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జనసేన అధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది.
జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విస్తృత స్థాయీ సమావేశం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు పాలనను కొత్తగా వచ్చిన పదేళ్ల పార్టీ ఎలా ఎదుర్కొబోతోందో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు.
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అటు టీడీపీ కూడా అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వైసీపీ నేత సజ్జల. టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఆధిపత్య…
‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద’ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. దీనికి ఆయన అభిమానులంతా చప్పళ్లు.. కేరింతలతో ఆదరించారు. ఈ సినిమాలో కన్పించినట్లుగానే పవర్ స్టార్ రాజకీయాల్లోనూ దూకుడుగానే వెళుతున్నారు. సినిమాల్లో బీజీగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. జనసేన…