Pawan Kalyan: ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ), హరిరామ జోగయ్య ( Harirama Jogaiah )లపై జనసేన అధినేత ( Janasena chief ) పవన్ కళ్యాణ్ పరోక్ష కామెంట్లు చేశారు. నిన్న.. మొన్న నాకు సలహాలిచ్చారు.. ఎలా నిలబడాలి, ఎలా చేయాలో చెప్పారు.. సీట్లు ఇవ్వడం కూడా నాకు తెలీదా?.. పవన్ దగ్గరే ఈ ఐడీయాలన్నీ వస్తాయి.. రిజర్వేషన్ల గురించి మాట్లాడినా.. ఏం మాట్లాడినా పద్దతిగా మాట్లాడాలి.. నాకు సలహాలిచ్చిన వాళ్లంతా వైసీపీకి వెళ్లారు.. కన్వీనియెంటుగా మాట్లాడే వ్యక్తులు నాకొద్దు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా..? జగన్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో నేనూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాను.. మోడీ ( Modi )తో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నా.. నేనేం స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీ పడలేదన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రిమిసెస్ కి పోలీసులు వచ్చారు.. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నేనూ గౌరవిస్తాను.. నాతో గొడవ పెట్టుకుంటానంటే పెట్టుకోండి.. కొట్లాటకు నేనూ సిద్దమే.. గెలిచి నేనే బయటకి వస్తా.. అది గుర్తు పెట్టుకోండి అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వెల్లడించారు.
Read Also: Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ కంపు కొడుతుందా.. యాసిడ్తో కాకుండా, ఇలా ట్రై చేయండి
సంఖ్యాబలం ఉన్న కులాల మధ్య ఐక్యత లేదు అని జనసేన చీఫ్ ( Janasena chief ) పేర్కొన్నారు. ఆ ఐక్యత లేకే జగన్ మనుషులకు ఊడిగం చేయాల్సి వస్తోంది.. నేను ఎక్కువ మాట్లాడాను.. మీ కోసం నిలబడతాను.. జగనులా చొక్కాలు మడత పెట్టను.. నేను ఇవన్నీ సినిమాల్లో చేశాను.. చేసి చేసి విసిగిపోయాను అని ఆయన తెలిపారు. వీళ్లంతా రీ-రికార్డింగులు వేసుకుంటారు.. కేజీఎఫ్, పుష్ప సినిమాల పుణ్యమా అని రీ-రికార్డింగులు ఎక్కువయ్యాయి.. మళ్లీ పంచ్ డైలాగులు వేస్తున్నారు.. జగన్ ( Jagan ) కు ఓ సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు.. మళ్లీ పంచ్ డైలాగులా? అంటూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విమర్శలు గుప్పించారు.