ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణంపై సందేహాలు కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు.. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నేతల పేరు మీదకు ఎలా మారిపోయింది..? అని ప్రశ్నించారు. సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకొనేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Harshit Rana – IPL 2024: 2 నేరాలకు రిఫరీ శిక్షలకు గురైన KKR ఆటగాడు.. భారీగా ఫైన్..!
అంతే కాదు ఆస్తులు రిజిస్ట్రేషన్ తరవాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వడం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూదందా కుట్రలో భాగమే అనిపిస్తోంది.. అధికార పదవుల్లోని ముఖ్య నాయకులు భారీగా దోచేస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని చట్టపరంగా చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు.. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. భూ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.