Bhimavaram MLA: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాదిమంది అభిమానులు ఉన్న అభిమాన గనుడు పవన్ కళ్యాణ్.. అలాంటిది ఆయనను నేను ఓడించలేదు అది ప్రజల చేసింది అన్నారు. పవన్ కళ్యాణ్, జగన్ ను పాతాళానికి తొక్కుతా అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ను పాతాళానికి తొక్కేస్తాడు అంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.
Read Also: LPG subsidy: ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త
ఈసారి ఎన్నికలకు పొత్తు లేకుండా వెళ్లుంటే మరోసారైనా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ముఖ్యమంత్రి అయ్యేవాడని ఎందరో మేధావులు చెప్పారు అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ( chandrababu ) బుట్టలో వేసుకున్నాడు అని ఆరోపించారు. టీడీపీ- జనసేన (tdp- janasena) పోత్తు లేకపోతే మరోసారి ఎన్నికలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( cm jagan ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండేవారు అంటూ ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.