జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawan kalyan) కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) మరో లేఖ రాశారు. ఇటీవలే జనసేనానికి జోగయ్య సలహాలు.. సూచనలు ఇస్తూ లేఖ రాశారు. కానీ పవన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ తనకు సలహాలు.. సూచనలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు.
కానీ.. తాజాగా హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధికారంలో భాగస్వామి అయ్యేవరకు తన పోరాటం ఆగదని లేఖలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎదుగుదలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు, నారా లోకేష్ భవిష్యత్‌ను కోరుకునేవాళ్లే తనను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. వీళ్లంతా జనసేన గొడుగు కింద ఉంటూ తెలుగుదేశం కోవర్టులుగా ఉంటారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌ను కాదని.. చంద్రబాబు భవిష్యత్ కోరుకునే వారిని ఇంతకన్నా ఏమనాలని తెలిపారు. తనను ఎవరు ఏమన్నా.. తన పని మాత్రం చేసుకుంటూ పోతానని హరిరామ జోగయ్య లేఖలో తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే హరిరామ జోగయ్య కుమారుడు ఇటీవలే వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖపై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.



H 3