Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు.
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది.
Migrant Labourer From Bihar Shot Dead By Terrorists: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వలస కూలీ, హిందువులను, స్థానికేతరులను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఇటీవల దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విధంగా వలస కూలీని కాల్చి చంపారు. బీహార్ మాదేపురాకు చెందిన వలస కూలీ మహ్మద్ అమ్రేజ్ ను టెర్రరిస్టులు కాల్చిచంపారు.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు.
జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గామ్‌లో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగం పన్నారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు దానిని భగ్నం చేశారు. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన 25 నుంచి 30 కిలోల ఐఈడీని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.
Encounter underway in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా వాటర్ హైల్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబా/ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు…
Article 370 revocation: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తర్వాత అన్నంతగా శాంతి భద్రత ఘటనల్లో మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత మూడేళ్లలో 88 శాతం శాంతి భద్రత ఘటనలు తగ్గాయని రాష్ట్రపోలీసులు వెల్లడించారు. ఆగస్టు 5, 2016 నుంచి ఆగస్టు 4, 2019 వరకు మూడేళ్లలో మొత్తం 3,686 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆగస్ట్ 5, 2019 నుంచి…
Mehbooba Mufti: బీజేపీ పార్టీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ఏదో రోజు బీజేపీ భారత జాతీయ జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని, జెండాను దోచుకున్న విధంగా బీజేపీ జాతీయ జెండాను కూడా మార్చి వేస్తుందంటూ ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ రాజ్యాంగాన్ని, దేశంలోని లౌకిక…