Mini bus Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో.. 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మండి ఆసుపత్రికి తరలించినట్లు మండి తహసీల్దార్ షెహజాద్ లతీఫ్ తెలిపారు.
Pakistan Boat: భారత జలాల్లో పాకిస్తాన్ బోట్ పట్టివేత.. 200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
బస్సు సావ్జియాన్ నుంచి మండికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారత సైన్యం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో మినీ బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మినీ బస్సు ప్రమాదంపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మినీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.