Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూంఛ్ నుంచి రాజౌరి వెళ్తున్న బస్సు మంజాకోట్ ప్రాంతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
READ ALSO: Pawan Kalyan : పవన్ కల్యాణ్ యాత్రకు ముస్తాబవుతున్న బస్సు..
వరసగా రెండు రోజుల్లో జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్రమాదాలు జరిగాయి. బుధవారం కూడా కాశ్మీర్లో అదుపు తప్పి ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. పూంఛ్ జిల్లాలోని సాజియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని మండీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. పూంచ్ నుంచి గాలి మైదాన్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో బస్సు లోయలో పడింది. వెంటనే సమాచారం అందుకున్న కాశ్మీర్ పోలీసులు, సైన్యం రెస్క్యూ ప్రారంభించింది. సరిహదుద్ ప్రాంతమైన సాజియాన్ లోని సబ్రారీ నాలకు రాగానే బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు వెల్లడించారు.
Deeply pained by the news of another tragic road accident in hilly district of Rajouri, at Deri Ralyote (Manjakote).
My deepest condolences to the families who lost their loved ones and pray for the speedy recovery of the injured. pic.twitter.com/UaoobVe8Ru— Chander Mohan Gupta(Modi ka Parivar) (@CMGuptaOfficial) September 15, 2022