Assembly Seats: ఈసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ సర్కారులకు సుప్రీంకోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225 వరకు పెంచాలని.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావర నిపుణుడు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019లో పొందుపరిచిన విధంగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుండి 90 వరకు పెంచేందుకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వును ఈ ఏడాది మే 5న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోని రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also:AP High Court: మోహన్‌బాబు అండ్ సన్స్‌కు హైకోర్టులో ఊరట..!!
Also Read
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల, ఏపీ చట్టంలోని సెక్షన్ 26లోని నిబంధన, రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని నిబంధనలకు లోబడి ఉండాలని ఉందని, అందువల్ల 2031 తరువాత జరిగే మొదటి జనాభా సంఖ్యా అందుబాటులోకి వచ్చేవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత రెండు అవకాశాలు ఉంటాయి. మొదటిది కాశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తీర్పు రావచ్చు. అప్పుడు కాశ్మీర్‌లో ఇప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. రెండోది కాశ్మీర్‌లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియతో ముందుకు సాగడానికి అవసరమైన రాజ్యాంగ, చట్టబద్ధమైన సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియకు మార్గం సుగమం చేస్తుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..