Jammu Kashmir: ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)కి అనుబంధంగా ఉండి, వలసదారులను హతమార్చడంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై పక్కా సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం బుధవారం సాయంత్రం శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)తో అనుబంధం కలిగి ఉన్నారు. వారిని పుల్వామాకు చెందిన ఐజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్ అలియాస్ అబూ హమ్జాగా గుర్తించారు. సెప్టెంబర్ 2న పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మునీర్ ఉల్ ఇస్లాం అనే కార్మికుడిపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మృతి చెందిన ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నారని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఏకే47 రైఫిల్, రెండు పిస్టల్స్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Fight For 2 Thousand: రెండు వేల కోసం భర్తతో గొడవ.. పుట్టింటికి పిలిపించి..
ఇదిలా ఉండగా,, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా భద్రతా పరిస్థితిని సమీక్షించారు. పూంచ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్, పూంచ్‌లోని సరిహద్దు గ్రామం దేగ్వార్ టెర్వాన్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), అక్కడి ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా అంచనా వేశారు.