Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..
- జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో వరసగా ఉగ్ర ఘటనలు..
- వీటి వెనక లష్కర్ తోయిబా ఉగ్రవాది..
- సైఫుల్లా సాజిద్ జట్ ప్రేమయం ఉందన్న నిఘా వర్గాలు..
- పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్‌కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందని సైఫుల్లా సాజిద్ జట్ ఈ దాడుల వెనక ఉన్న మాస్టర్ మైండ్‌గా ఎన్ఐఏ తెలిపింది. ఈ ‘హర్డ్ కోర్ టెర్రరిస్ట్’ తలపై రూ.10 లక్షల బహుమతి ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని బేస్ క్యాంప్‌లో జాట్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అతని భార్య భారతీయ మూలాలకు చెందిన వ్యక్తి అని, అతనితోనే ఉంటుందని వారు తెలిపారు.
Read Also: J-K: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదుల హతం..
Also Read
ఇందకుముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పనిచేసిన జట్, ప్రస్తుతం లష్కర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు భారత్‌లోని ప్రవేశించడానికి సాయం చేస్తున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. సాజిద్ జట్‌ను లష్కర్‌కి ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తూనే, దాని టెర్రర్ ఫండింగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనికి జమ్మూ కాశ్మీర్‌లో ఖాసిమ్ అనే వ్యక్తి ఉన్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతని కోసం భద్రతా సంస్థలు వేట సాగిస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా కాశ్మీర్ లోయలో జరిగే అనేక ఉగ్రఘటనల వెనక జట్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
గత రెండు నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత నెలలో రియాసిలో యాత్రికుల బస్సుపై అటాక్ జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. కుల్గాం జిల్లాలో గత రెండు రోజులుగా జరిగి వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగులు ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?