Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు.
జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 24 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అక్కడ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తరుచూ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ రోజు కథువా జిల్లాలోని బనీ ప్రాంతంలో భద్రతా బలగాలు,
Sam Pitroda: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్‌కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.