Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది.
Encounter : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు బుధవారం భారీ చర్యలు చేపట్టాయి. కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
Rahul Gandhi : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ వేడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం శ్రీనగర్ చేరుకున్నారు.
Jammu Kashmir Assembly Polls: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు.
Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం వచ్చింది. బారాముల్లా జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతంలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా ప్రకంపలను రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. శుక్రవారం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల సంఘం ప్రత్యేక సన్నాహాలు చేసింది.
Jammu Kashmir Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
Special 19Team : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత భద్రతా దళాలు మోహరించి ప్రతి కదలికపై నిఘా ఉంచాయి.
ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ డీజీ)గా నియమితులయ్యారు. సెప్టెంబరు 30న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ తర్వాత ఆయన దళం చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.