Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్‌కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Secunderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఏడు క్వింటాళ్ల కుళ్ళిపోయిన కోడి మాంసం స్వాధీనం
జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది. స్థానికేతరుడిని హత్య చేయడంతో ఈ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఏప్రిల్ నెలలో ఇలాగే ఇద్దరు స్థానికేతర కూలీలను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భారత ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. అతడి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్టోబర్ 8న ప్రారంభించిన జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో టెరిటోరియల్ ఆర్మీ 161 యూనిక్‌కి చెందిన ఇద్దరు సైనికులు అనంత్ నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్ చేయబడ్డారు. ఇందులో ఒకరు తప్పించుకోగా.. మరొకరిని ఉగ్రవాదులు చంపేశారు.