Indian Army Soldier: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ జవాను వీరమరణం పొందినట్లు సీనియర్ సైనిక అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, అక్టోబర్ 8న ప్రారంభించిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి అపహరణకు గురయ్యారు.
Mahesh Kumar Goud: నాగార్జున వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం.. మేమెందుకు స్పందించాలి..!
వారిలో ఒకరికి బుల్లెట్ గాయాలు తగిలినప్పటికీ, ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆ తరువాత, సెర్చ్ ఆపరేషన్ సమయంలో రెండవ సైనికుడు అనంతనాగ్‌లోని రాతి అటవీ ప్రాంతంలో అతని శరీరంపై బుల్లెట్స్, కత్తి గుర్తులతో ఉండి చనిపినట్లు అధికారులు తెలిపారు. ఇక మరోవైపు, జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చొరబాటుదారుని అరెస్టు చేశారు. పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 31 ఏళ్ల వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు.