జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో భారత ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 5 మంది సైనికులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆ ప్రాంతం సీల్ చేయబడింది. ఆ ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లో గత నాలుగు రోజుల్లో ఇది మూడో అతిపెద్ద దాడి. అంతకుముందు అక్టోబర్ 20న గందర్‌బాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో డాక్టర్‌తో సహా 7 మంది చనిపోయారు. గురువారం ఉదయం కూడా వలసేతర కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.
READ MORE: Cyclone Dana Effect: కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులు మూసివేత.. ప్రయాణికులకు ఇక్కట్లు
గుల్‌మార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిపై, బారాముల్లా జిల్లాలోని బోటపత్రి వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు పిటిఐకి తెలిపారు. దాడిలో గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చారు. గుల్‌మార్గ్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి గంటల ముందు పుల్వామాలో అనుమానాస్పద ఉగ్రవాద దాడిలో స్థానికేతర కార్మికుడు గాయపడ్డాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం కుమార్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం బటాగుండ్ గ్రామంలో ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ అతని చేతికి తగిలింది. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు.