జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు. నిరంతర ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికులపై దాడులు, పౌరుల హత్యల కారణంగా ఈ రాష్ట్రం ప్రమాదపు నీడలో జీవిస్తోందని పేర్కొన్నారు.
READ MORE: Health Tips: శీతాకాలంలో జలుబు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది! ఈ టిప్స్ పాటించండి..
గుల్మార్గ్ ఉగ్రదాడిపై రాహుల్ గాంధీ ట్వీట్..
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో సైనిక వాహనంపై జరిగిన పిరికిపంద దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందారనే వార్త చాలా బాధాకరం అని రాహుల్ గాంధీ రాశారు. “జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆర్మీ వాహనంపై జరిగిన పిరికిపంద దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందారనే వార్త చాలా బాధాకరం. ఈ దాడిలో ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
READ MORE: Jani Master: 36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్
జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయని రాహుల్ ఆరోపించారు. వాదనలకు విరుద్ధంగా, వాస్తవికత ఏమిటంటే, ఉగ్రవాద కార్యకలాపాలు, మన సైనికులపై దాడులు, పౌరులను లక్ష్యంగా చేసుకున్న హత్యల కారణంగా రాష్ట్రం ముప్పులో ఉందని తెలిపారు. “ప్రభుత్వం తక్షణమే జవాబుదారీతనం వహించాలి. వీలైనంత త్వరగా లోయలో శాంతిని పునరుద్ధరించాలి. సైన్యం, పౌరులకు భద్రత కల్పించాలి.” అని పేర్కొన్నారు.