రాజస్థాన్‌లో ఈసారి మే నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 100 ఏళ్లలో ఇదే నెలలో అత్యధికం అని భారత వాతావరణ శాఖ నిన్న ( గురువారం ) తెలిపింది. రాష్ట్రంలో సాధారణంగా మే నెలలో సగటున 13.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
Rajasthan: బోరుబావి ప్రమాదాలు మనం చాలా సార్లు చూశాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు. అధికారులు ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరకు వారి మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ రాజస్థాన్ లో ఓ 9 ఏళ్ల పిల్లాడు బోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థార్ లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్‌మెంట్‌లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు మ్యా్చ్ ల్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలను సాధిచింది. అయితే జైపూర్ వేదికగా జరిగే ఇవాళ్టి మ్యాచ్ లో సీఎస్కే వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది.
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ మరో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంలోని మంత్రుల తీరుతో గెహ్లాట్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు శ్యామ్ రంగీలాకు సోమవారం జైపూర్‌లోని ప్రాంతీయ అటవీ అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసు అందజేసింది. జైపూర్ నగరంలోని ఝలానా చిరుతపులి రిజర్వ్‌లో నీల్‌గాయ్‌కు ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది.
రాజస్థాన్ రాష్ట్ర రాజధానిని కుదిపేసిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులను రాష్ట్ర హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మే 13, 2008న జైపూర్ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి.
Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేను ప్రాజెక్టును మొదలుపెట్టింది. 1,386 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ఆర్థిక రాజధాని ముంబైని దేశరాజధాని ఢిల్లీని కలుపుతుంది. ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింతగా తగ్గతుంది. 180 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ఇప్పుడున్న 24…